గరివిడి మండలం, గెడ్డపువలస గ్రామంలో యూనిట్ ఇంచార్జి గుడివాడ సింహాచలం, ప్రకృతి వ్యవసాయ కార్యకర్త తుమ్మగంటి సుశీల ఆధ్వర్యంలో.. రైతుల సమక్షంలో శుక్రవారం 200 లీటర్ల జిల్లేడు ద్రావణం తయారీ చేసారు. వరి పొట్ట దశలో ఉన్నందున పోటాషియం అవసరం అన్నారు. అలాగే పోటాష్ బదులు ఈ జిల్లేడు ద్రావణం ఉపయోగించడం వలన రైతులకు ఖర్చు తగ్గుతుందని, భూమికి హాని కలుగదన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్దతిలో జిల్లేడు ద్రావణం పిచికారీ చేయాలని వారు రైతులకు సూచించారు.