అసాంఘిక కార్యకలాపాలకు లాడ్జి యజమానులు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గజపతినగరం సిఐ జి ఏ వి రమణ హెచ్చరించారు. ఆదివారం ఆయన ఎస్ఐ కె లక్ష్మణరావు తో కలిసి మండల కేంద్రంలో గల లాడ్జిలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. లాడ్జిలో ఉన్న వారి ఆధార్ కార్డులు, చిరునామాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. లాడ్జి నిర్వాహకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.