గంట్యాడ మండలంలో రెండు రోజులు పెన్షన్ల వెరిఫికేషన్ కార్యక్రమం జరుగుతుందని ఎంపీడీవో ఆర్. వి రమణమూర్తి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటింటికీ వెళ్లి పెన్షన్ దారుల సర్టిఫికెట్లను పరిశీలించడంతో పాటు వైద్య బృందం సమక్షంలో పెన్షన్లకు అర్హులు అవునా, కాదా అన్న విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ఈ రెండు రోజులు పెన్షన్ దారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.