మెంటాడ మండలం జయితి గ్రామంలో శ్రీ భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి దేవాలయంను సోమవారం గజపతినగరం సీఐ జీఏ వి. రమణ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయ అర్చకులు సీఐ రమణ కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 11వ శతాబ్దం నాటి దేవాలయం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ చాపన జోగి నాయుడు తెలిపారు.