గజపతినగరంలో సోమవారం తెల్లవారుజామున బైపాస్ రోడ్డు వద్ద లారీ బోల్తా పడింది. ఆ సమయంలో జనసంచారం తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. బైపాస్ రోడ్డు నిర్మాణ పనుల్లో ఖానా నిర్మించి మట్టి వేయకపోవడంతో వర్షాలకు మట్టి కరిగిపోయింది. దీంతో ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇచ్చే క్రమంలో లోడు లారీ కూరుకుపోయి బోల్తా పడింది.