కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా కొమరాడ మండలం గుంప సోమేశ్వర ఆలయంలో కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని స్థానికులు, అర్చకులు కలెక్టర్కు విన్నవించుకున్నారు. ఆలయ అభివృద్ధికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తామని కలెక్టర్ తెలిపారు.