గుమ్మలక్ష్మీపురం మండలంలోని బుడంకార్జా గిరిజనసంక్షేమ బాలురఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఎగువ మంత్రజల గ్రామానికి చెందినపత్తిక దినేష్ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. దినేష్ దసరా సెలవులకు ఇంటికి వెళ్లి తిరిగి పాఠశాలకు రాలేదని ఉపాధ్యాయులు తెలిపారు. పచ్చకామెర్లు, రక్తహీనత, కిడ్నీకి సంబంధించిన వ్యాధులతో బాధపడేవాడని చెప్పారు. ఈ నేపథ్యంలో దినేష్ను కేజీహెచ్లో చేర్చినా ఫలితం దక్కలేదని మంగళవారం తెలిపారు.