పార్వతీపురం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఆదివారం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, అరకు పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. ఎన్నికల లెక్కింపు ఈనెల 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. లెక్కింపు ఏర్పాట్లపై సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యాన కళాశాలలో జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవిఎం ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.