పార్వతీపురం మండలం రావికోన పంచాయతీ పరిధిలో గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న భూములను ఆక్రమించుకున్న ప్రైవేటు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం. కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం డిఆర్‌ఒ జి. కేశవ నాయుడుకు వినతిని అందించారు. రావికోన నుండి చినమరికి వెళ్లే దారిని అనుసరించి గిరిజనులకు చెందిన సుమారు 30 ఎకరాల పట్టా భూములను అగినేంద్రపు ఫకీరు రెవెన్యూ అధికారులతో కుమ్ముకైరన్నారు.