మన్యం జిల్లాలో రీసర్వే పక్కాగా చేపట్టాలని మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఎస్. శోభిక రెవిన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం సీతానగరం మండలం వి. బచ్చెంపేట గ్రామంలో రీ సర్వే కొరకు నిర్వహించిన గ్రామసభను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. రెవిన్యూ అధికారులకు ఈ సందర్బంగా పలు సూచనలు, మార్గదర్శకాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ రెవెన్యూ రికార్డుల ప్రకారం భూహక్కుదారుల పేర్లు సరిచేసుకోవాలని అన్నారు.