పేదలకు, కార్మికులకు, విద్యార్ధులకు అన్న క్యాంటీన్ల వల్ల ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రూ. 5 కే రుచికరమైన భోజనం, టిఫిన్ పొందే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. శుక్రవారం నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్, మునిసిపల్ మార్కెట్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రెండు అన్న క్యాంటీన్లను మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుతో కలసి మంత్రి ప్రారంభించారు.