సంతకవిటిలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు జడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహనరావు, గాంధీ విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీ చూపిన బాట మనoదరికి ఆదర్శమన్నారు. ఈమేరకు స్వచ్చత హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఎస్. మంజు, ఏవో రఘునాథచారి, ఎస్ఐ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.