మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని రాజాం నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జ్ తలే రాజేష్ అన్నారు నియోజకవర్గ నాయకులతో కలిసి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి శుక్రవారం నివాళులర్పించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలు అమూల్యమైనవని కొనియాడారు.