రాజాం పట్టణంలో శ్రీ లోలుగు సుశీల మెమోరియల్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న సైనిక శిక్షణ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుంది. గతంలో 24 మంది అభ్యర్థులు సైనికోద్యోగాలలో స్థిరపడగా, ఇటీవల వెల్లడించిన ఫలితాల్లో మరో పదహారు మంది సిఐఎస్ఎఫ్, ఐటిబిపి, బిఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ సంస్థలలో ఉద్యోగ అర్హత సాధించారు. వీరిని శ్రీమతి లోలుగు సుశీల ఫౌండేషన్ చైర్మన్ లోలుగు మదన్ మోహన్, జీఎంఆర్ గ్రూప్ సంస్థల ప్రతినిధి అన్నం నాయుడు, రాజాం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమంతు ఉపేంద్ర సత్కరించారు.