కిక్కిరిసిన ఆటోల్లో విద్యార్థులు ప్రతీరోజూ ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణాలు చేస్తున్నారు. వంగర, సంతకవిటి మండలాల నుండి రాజాం వెళ్ళి చదువుకునే విద్యార్థులు బస్సుల కోసం రోజూ పడిగాపులు పడుతున్నారు. దాంతో సకాలంలో పాఠశాలలు, కాలేజీలకు వెళ్లలేకపోతున్నారు. ఈరోడ్లో వచ్చే అరకొర బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసి ఉంటుండటంతో బస్సు ఎక్కలేని పరిస్థితి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆటోల్లో విద్యార్థులు వెళ్లాల్సి వస్తుంది.