మహిళా సమస్యలపై తక్షణమే స్పందించాలని స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ రాధ తెలిపారు. సాలూరు పట్టణ సిఐ గా బాధ్యతలు తీసుకున్న జీ డి బాబుని మర్యాదపూర్వకంగా సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో శనివారం స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ రాధ కలిశారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పోలీస్ శాఖ ద్వారా న్యాయం చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.