సాలూరు ప్రాంతంలో కుండపోత వర్షం

55చూసినవారు
సాలూరు ప్రాంతంలో శుక్రవారం ఈదురుగాలులు, ఉరుములతో కూడిన కుండపోత వర్షం కురిసింది. మధ్యాహ్నం 12. 42 గంటల నుండి ఎండ తీవ్రత అధికంగా ఉంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అనంతరం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై మబ్బులు కమ్ముకున్నాయి. క్షణాల్లోనే ఈదురుగాలులు, పెద్దపెద్ద ఉరుములతో కుండపోత వర్షం గంటన్నర పాటు కురిసింది. దీంతో రోడ్లు, డ్రైనేజీలు జలమయమయ్యాయి.

సంబంధిత పోస్ట్