సాలూరులో యువతి ఆత్మహత్య

2928చూసినవారు
సాలూరులో యువతి ఆత్మహత్య
ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన సాలూరులో చోటు చేసుకుంది. పట్టణ సీఐ సీహెచ్ వాసునాయుడు తెలిపిన వివరాల ప్రకారం. గడివలసకి చెందిన చోడిపల్లి ఉష(19) పట్టణంలో ఓ హోటల్లో పని చేస్తుంది. ఆదివారం సాయంత్రం సాలూరులో అద్దెకు ఉన్న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని వచ్చిన ఫిర్యాదుతో వెళ్లి పరిశీలించామన్నారు. తండ్రి ఫిర్యాదుతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్