ప్రతి ఒక్క రైతు విధిగా ఈ పంట నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి రవీంద్ర కోరారు. బుధవారం ఎస్ కోట మండలం వినాయక పల్లిలో ఈ పంట నమోదు సోషల్ ఆడిట్ కు సంబంధించి జరిగిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రాప్ నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ రాయితీలు రైతులు పొందవచ్చన్నారు. ఇప్పటికే ఈక్రాప్ నమోదు చేసుకోని రైతులు సత్వరమే నమోదు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వి ఏ ఏ రవి తదితర వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.