ఎస్ కోట మండలంలో విస్తృతంగా వాహన తనిఖీలు

82చూసినవారు
ఎస్ కోట మండలంలో రవాణా శాఖ అధికారులు గురువారం విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. మండలంలోని సీతంపేట, వెంకటరమణపేట తదితర ప్రాంతాల్లో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్రావు స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్ కే రమేష్ తో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. వాహనాలను ఆపి వాహన పత్రాలను పరిశీలించారు. పత్రాలు సరిగా లేని వాహనదారులకు అపరాధ రుసుం విధించారు. ట్రాఫిక్ నిబంధనలను వాహనదారులు విధిగా పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్