జామి పిహెచ్ సి వైద్య సిబ్బందికి వైద్యాధికారిణి శైలజ మంగళవారం స్థానిక పీహెచ్ సిలో ప్రజారోగ్యం పై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆశా డే కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో వైద్య సిబ్బంది పర్యటించి ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన చేపట్టాలని తెలిపారు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ యాప్ పై అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో డయేరియా, కీటక జనిత వ్యాధులు రాకుండా చూసుకోవాలని కోరారు.