75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్. కోట మండల వైసీపీ అధ్యక్షులు మోపాడ కుమార్ తదితర వైసిపి నాయకులు ఆధ్వర్యంలో మంగళవారం ఎస్ కోటలోని భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్థానిక పాత బస్టాండ్ సమీపంలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పినిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.