పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు కోరారు. శుక్రవారం జరిగిన శాసనమండలి సమావేశాల్లో ఆయన ఈ అంశంపై ప్రస్తావించారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే ఆదాయ మార్గాలు మెరుగుపడతాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రాలైన అరకు, వనజంగి, భవాని ఐలాండ్స్ తదితర ప్రాంతాలను పర్యాటక పరంగా అభివృద్ధి చేయాలని సంబంధిత పర్యాటక శాఖ మంత్రి ని కోరారు.