ఎల్ కోట: ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ రఘు రాజు
ఎల్ కోట మండలం కొట్యాడ జడ్పీ హైస్కూల్ ను ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు బుధవారం సందర్శించారు. పాఠశాల పరిసరాలను, రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించి, ఉపాధ్యాయులకు పలు సూచనలు, సలహాలు చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ సక్రమంగా అమలు చేయాలని సూచించారు. మాజీ ఎంపీటీసీ రాముడు, వసి వెంకట్రావు తదితర పాఠశాల అధ్యాపకులు పాల్గొన్నారు.