AP: విశాఖ శారదాపీఠం స్వామిజీ స్వరూపానందేంద్రకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎక్స్ కేటగిరీ భద్రతను ఉపసంహరించుకోవాలని పీఠం మేనేజర్ ఏపీ డీజీపీకి లేఖ ద్వారా కోరారు. ఇకపై ఆయన రుషికేశ్‌లో తపస్సులో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో స్వరూపానందేంద్ర త్వరలో రాష్ట్రాన్ని వీడిపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్వరూపానందేంద్ర రాజగురువుగా ఓ వెలుగు వెలిగారు.