తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంక్షేమ పథకాలు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు 2025 వేదిక కాబోతోందన్నారు. '6 నెలల్లోనే సుపరిపాలనను ఆవిష్కృతం చేశాం. పింఛన్ల మొత్తాన్ని పెంచాం. ఫ్రీగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ధాన్యం డబ్బులు 48గంటల్లో చెల్లించాం. రోడ్లపై గుంతలు లేకుండా చేస్తున్నాం. పెట్టుబడులు తెచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు నాంది పలికాం' అని ట్వీట్ చేశారు.