ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో టీటీడీ, దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానాల వేదపండితుల దివ్య ఆశీస్సుల మధ్య సీఎస్ గా బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జి.సాయిప్రసాద్, యం.టి.కృష్ణబాబు, టీటీడీ ఈవో శ్యామలరావు, జీఏడీ కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు, ఇతర అధికారులు బోకేలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.