AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు వద్ద జనసేన నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుతో పాటు ఆయన ఇవాళ సాయంత్రం రోడ్ షోలో పాల్గొననున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కాగా, ఇప్పటికే పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు విశాఖకు చేరుకుంటున్నారు.