జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. నిన్న స్వల్పంగా ఉన్న జ్వరం ఇప్పుడు తీవ్రమైనట్లు వెల్లడించింది. జ్వరం కారణంగా ఇవాల్టి తెనాలి, రేపటి నెల్లిమర్ల పర్యటనలను రద్దు చేసుకున్నట్లు తెలిపింది. పవన్‌కు కనీసం 2-3 రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు పేర్కొంది. పర్యటన రీ షెడ్యూల్ వివరాలను త్వరలో ప్రకటిస్తామని వివరించింది.