AP: తాబేళ్ల సంరక్షణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. దాంతో సముద్రంలో 5 నెలల పాటు చేపల వేటపై నిషేధం విధించారు. అంతేకాదు తీర ప్రాంతం ఐదు కిలో మీటర్ల మేర పెట్రోలింగ్ నిర్వహించారు. చేపల వేటకు వెళ్తున్న 2 బోట్లను సీజ్ చేశారు. కాగా, ఇటీవల కాలంలో తాబేళ్లు అక్రమంగా రవాణా అవుతున్నాయి. కాకినాడ జిల్లా వాకపూడి వద్ద సముద్రంలో అక్రమంగా తాబేళ్ల వేట యథేచ్చగా జరుగుతున్న విషయం తెలిసిందే.