ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లా బాగోజాలలో పర్యటించారు. ఈ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి పాల్గొనడంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. 'నకిలీ ఐపీఎస్ అధికారి నా చుట్టూ తిరిగాడని అంటున్నారు. అది ఇంటెలిజెన్స్, పోలీసులు చూసుకోవాల్సిన బాధ్యత. దీనిపై అధికారులతో మాట్లాడుతున్నాను. నాకు పని చేయడం తెలుసు. నాకు రక్షణ ఉన్నా పని చేస్తా.. రక్షణ లేకపోయినా పని చేస్తా' అని పవన్ అన్నారు.