పవన్ కళ్యాణ్‌కు కలిసొచ్చిన ‘21’

70చూసినవారు
పవన్ కళ్యాణ్‌కు కలిసొచ్చిన ‘21’
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే పవన్ కళ్యాణ్‌కు ‘21’ నంబర్ కలిసొచ్చిందనే వార్త వైరల్ అవుతోంది. 21 సీట్లు తీసుకొని, 21 సీట్లు గెలిచి, 21 మంది ఎమ్మెల్యేలతో 21వ తేదీన అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 21 నంబర్ పవన్ కళ్యాణ్‌కు బాగా కలిసొచ్చిందని జనసైనికులు సంబరపడిపోతున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్‌‌తో పాటు తదితరులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్