ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 14 నుంచి ప్రతి పంచాయతీలో అభివృద్ధి పనులు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 14 నుంచి వారం రోజుల పాటు పనుల ప్రారంభాన్ని ఒక పండగలా చేయాలని దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను ఇందులో భాగస్వాముల్ని చేయాలన్నారు.