AP: వైసీపీ పాలనలో సినిమా టికెట్ల దగ్గర నుంచి ఇసుక దోపిడీ దాకా అక్రమాలు చేస్తే.. ఐఏఎస్ అధికారులు, బ్యూరోక్రాట్‌లు ఎందుకు అభ్యంతరం తెలపలేదంటూ డిప్యూటీ సీఎం పవన్ నిలదీశారు.. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పవన్ మాట్లాడుతూ.. వైసీపీ విధ్వంసక పాలనలో రాష్ట్రం 10 లక్షల కోట్లు అప్పుల పాలైందని, కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కాకినాడ పోర్టులో స్మగ్గింగ్ వ్యవహారం చూస్తే కసబ్ వంటి వారు జలమార్గంలో చొరబడటంలో ఆశ్చర్యం లేదన్నారు.