టీమ్ ఇండియా బ్రిస్బేన్ చేరుకుంది. బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో జరగబోయే మూడో టెస్టుకు గబ్బా మైదానం వేదికైంది. ఈ నెల 14 నుంచి ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా సిరీస్ ఇప్పటికే 1–1తో సమంగా ఉంది. దీనిని 2-1గా మార్చాలని భారత్ భావిస్తోంది. ఈ టెస్టులో ఎలాగైనా గెలిచి ముందంజలో ఉండాలని యోచిస్తోంది. మరోవైపు రెండో టెస్టు గెలిచిన జోష్‌తో మూడో టెస్ట్ గెలవాలని ఆసీస్ తాపత్రయపడుతోంది.