మోహన్‌బాబు ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల

62చూసినవారు
మోహన్‌బాబు ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల
TG: నటుడు మోహన్‌బాబు మంగళవారం రాత్రి గచ్చిబౌలిలోని కాంటినెంటెల్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ తాజాగా ఆస్పత్రి బృందం ఒక హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. ఒళ్ళు నొప్పులు, ఆందోళన వంటి కారణాలతో ఆయన ఆస్పత్రిలో చేరారని పేర్కొంది. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు కంటి దిగువభాగంలో గాయమైనట్లు గుర్తించింది. బీపీ ఎక్కువగా ఉందని, గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు ఉన్నాయని పేర్కొంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్