జనసేన అధినేతగా ఉన్నప్పటి నుంచి పవన్ ఆదర్శవంతమైన రాజకీయాలు చేయాలనే తపించారు. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది. పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఆయన ఆదర్శాలు ఆచరణలో ఎంతమేరకు అమలు అవుతాయన్నది చూడాలని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మంత్రిగా ఉన్న పవన్ ఆశయాలు కనుక నెరవేరితే ఏపీకి తిరుగు ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు.