AP: దివంగత సీఎం ఎన్టీఆర్ తరహాలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సినిమా రంగాన్ని వదిలేయాలని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి అన్నారు. "ఎన్టీఆర్ సీఎం అయ్యాక సినిమాల్లో నటించడం మానేశారు. చట్టం ఒప్పుకోకపోవడం వల్ల అలా చేశారేమో తెలియదు. మధ్యలో ఓ సినిమాలో నటించాల్సి వస్తే కేంద్రం నుంచో, సుప్రీంకోర్టు నుంచో అనుమతి తీసుకున్నారు. పవన్ కూడా NTR తరహాలోనే సినిమాలు మానేయాలి." అని ఆయన సూచించారు.