రేపు పిఠాపురంలో పర్యటించనున్న పవన్
By తానూరు గోపిచంద్ 83చూసినవారుఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు, ఎల్లుండి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రేపు ఉదయం 11 గంటలకు పవన్ రాజమండ్రి ఎయిర్ పోర్టులో దిగనున్నారు. అక్కడ నుండి రోడ్డు మార్గంలో గొల్లప్రోలు జిల్లా పరిషత్ స్కూల్‌కు వెళ్లనున్నారు. అనంతరం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించనున్నారు.