పిన్నెల్లికి 14 రోజుల రిమాండ్

50చూసినవారు
పిన్నెల్లికి 14 రోజుల రిమాండ్
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల జూనియర్ సివిల్ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు, కారంపూడి సీఐపై దాడి కేసుల్లో రిమాండ్ విధించగా.. ఈవీఎం ధ్వంసం, మహిళపై దాడి కేసుల్లో బెయిల్ మంజూరు చేశారు. పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించాలని జడ్జి ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్