ఛత్తీస్‌గఢ్‌లోని గౌరెలాలో బుధవారం ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. ముసుగు ధరించిన ఓ యువకుడు వచ్చి రోడ్డుపై ఓ యువతిని ఫోన్ అడిగాడు. ఆ తర్వాత అందరూ చూస్తుండగానే ఆ యువతిని గొంతు కోసి క్రూరంగా చంపాడు. హత్య తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ సమయంలో అక్కడ చాలా మంది ఉన్నప్పటికీ, ఎవరూ హత్యను అడ్డుకునేందుకు ముందుకు రాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.