పోసాని ఎఫెక్ట్.. హైకోర్టుకు సజ్జల

76చూసినవారు
పోసాని ఎఫెక్ట్.. హైకోర్టుకు సజ్జల
AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తన కుమారుడు భార్గవ్ రెడ్డితో కలిసి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. సజ్జల స్క్రిప్ట్ ఆధారంగానే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ను తిట్టానని పోసాని కృష్ణమురళి చెప్పిన విషయం తెలిసిందే. దాంతో సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ కోర్టు మెట్లెక్కారు. తమను అనవసరంగా ఈ వివాదంలోకి లాగుతున్నారని, రాజకీయ కక్షతోనే ఇరికిస్తున్నారని తెలిపారు. తాము విచారణకు సహకరిస్తామని, బెయిల్ ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్