ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఆదివారం సాయంత్రం ఓ మోస్తారు వర్షం కురిసింది. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుత కురుస్తున్న వర్షాలతో రైతులు ఆనందంగా ఉన్న గిద్దలూరు పరిసర ప్రాంతాలలో మరిన్ని వర్షాలు కురవాలని రైతన్నలు వరుణ దేవుడిని ప్రార్థిస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా సరైన వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే నియోజకవర్గంలో భూగర్భ జలాలు అడుగంటాయి.