ప్రకాశం ప్రాంతంలో విస్తారంగా వర్షాలు

559చూసినవారు
పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ ప్రకాశం ప్రాంతాలైన అర్ధవీడు, బేస్తవారిపేట, కంభం ప్రాంతాలలో గురువారం వర్షం దంచి కొట్టింది. గంటకు పైగా నాన్ స్టాప్ గా వర్షం కురిసింది. దీంతో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. 2 సంవత్సరాలకు పైగా ఈ ప్రాంతంలో సరైన వర్షాలు లేకపోవడంతో నీటి జలాలు అడుగంటాయి. ఈ వర్షాలతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్