గిద్దలూరు: కొండచిలువ కలకలం

59చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అంబవరం గ్రామ సచివాలయం సమీపంలోని ఓ గడ్డివాములో సోమవారం కొండచిలువ కలకలం రేపింది. స్థానికులు కొండచిలువను చూసి భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని కొండచిలువను అధికారులు బంధించారు. తర్వాత నల్లమల్ల అటవీ ప్రాంతంలో కొండచిలువను విడిచిపెట్టారు. ఆ కొండచిలువ 7 అడుగులకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్