కంభంలో భార్య అంజలిని హత్య చేసిన నిందితుడు శివ రంగయ్యను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. భార్య ప్రవర్తన పై అనుమానం పెంచుకొని భర్త శివ రంగయ్య పథకం ప్రకారం భార్య నిద్రిస్తున్న సమయంలో జనవరి 13వ తేదీ తెల్లవారుజామున బలమైన కర్రతో దాడి చేసి హతమార్చినట్లుగా మీడియా సమావేశంలో బుధవారం మార్కాపురం డిఎస్పి నాగరాజు వెల్లడించారు. హత్య కేసును త్వరగా చేదించిన సిఐ, ఎస్ఐలను డిఎస్పి అభినందించారు.