కంభం మండలంలోని రంగా వీధిలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ-1 బి.మాల్యాద్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి వారీగా విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను, వర్క్ బుక్స్, నోట్ బుక్స్ క్షుణ్ణంగా పరిశీలించారు. తెలుగు, ఆంగ్ల భాషా సామర్ధ్యాలను, పఠన నైపుణ్యలను గణితంలో చతుర్విధ ప్రక్రియలను పరిశీలించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాలను పరిశీలించి, మధ్యాహ్న భోజన నిర్వాహకులకు, ఆయాకు పరిశుభ్రత అంశాలపై సూచనలు చేశారు.