పెచ్చులూడుతూ ప్రమాదకరంగా కనిగిరి బస్టాండ్

82చూసినవారు
పెచ్చులూడుతూ ప్రమాదకరంగా కనిగిరి బస్టాండ్
కనిగిరి ఆర్టీసీ డిపోకి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. డిపో కాంప్లెక్స్ లో జనం కిటకిటలాడుతుంటారు. అంతటి ప్రాధాన్యత ఉన్న డిపో స్లాబ్ పెచ్చులూడి ప్రమాదకరంగా మారింది. శిథిలావస్థకు చేరిన భవనాన్ని, ప్రయాణికుల ఇబ్బందులను ఆర్టీసీ అధికారులు విస్మరించారు. స్లాబ్ పెచ్చులూడి తలలపై పడుతుండటంతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. పరిస్థితి తీవ్ర రూపం దాల్చకముందే మరమ్మతులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్