సినీ నటుడు పోసాని కృష్ణమురళి పై చర్యలు తీసుకోవాలని టిడిపి నాయకులు, కనిగిరి సర్కిల్ కార్యాలయంలో సిఐ ఖాజావలకి గురువారం వినతిపత్రాన్ని అందించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఈ ఫిర్యాదు చేసినట్లుగా టిడిపి నాయకులు వెల్లడించారు. ఇటీవల బిఆర్ నాయుడు పై పోసాని చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదమని తెలిపారు. ఆయనపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.