కనిగిరిలోని టిడిపి కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ పేదల పక్షపాతి అని, దేశంలో ఎన్నడూ లేని విధంగా రూ. 2లకే కిలో బియ్యం పంపిణీ చేసిన వ్యక్తి రామారావు అని కొనియాడారు.